చంద్రబింబం: సెప్టెంబర్ 14 నుండి 20 వరకు | Funday Astrology of the week: Sept 14 to Sept 20 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం: సెప్టెంబర్ 14 నుండి 20 వరకు

Published Sun, Sep 14 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

Funday Astrology of the week: Sept 14 to Sept 20

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. కళారంగం వారికి ఒత్తిడులు. వారం మధ్యలో ధన, వస్తులాభాలు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ప్రత్యర్థులూ మీ బాటలో సాగుతారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులు, నిరుద్యోగులు అసంతృప్తి చెందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక  పరిస్థితి  మెరుగ్గా ఉంటుంది.  వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 ఈ వారం పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
 ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న హోదాలు పొందుతారు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
 ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఒక ప్రకటన నిరుద్యోగులను నిరాశ పరుస్తుంది. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
 
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 కొన్ని పనులు మధ్యలో వాయిదా పడవచ్చు. ఆలోచనలు అంతగా కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకోని ప్రయాణాలు. సోదరులతో వివాదాలు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు కాగలవు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి ఆహ్వానాలు. వారం చివరిలో అనారోగ్య సూచనలు. వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. నిర్ణయాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు చికాకులు. కళారంగం వారికి గందరగోళం. వారం చివరిలో ధన, వస్తులాభాలు.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.  దూరప్రయాణాలు ఉంటాయి. పనులు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ఆస్తి, ధనలాభం.
- సింహంభట్ల సుబ్బారావు,
 జ్యోతిష పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement