రచన: జూలూరు గౌరీశంకర్
పేజీలు: 372; వెల: 300
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-36.
తెలుగు సాహిత్య వేదిక (12 గంటల నిర్విరామ ప్రసంగ వ్యాసాల సంపుటి)
రచన: డా. ద్వా.నా.శాస్త్రి
పేజీలు: 134; వెల: 100
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతో పాటుగా, రచయిత, 1-1-428, గాంధీనగర్, హైదరాబాద్-80.
ఫోన్: 9849293376
స్వామి రామదాస్ పద్యాలు (ఆధ్యాత్మికం)
అనువాదం: డా.మౌని
పేజీలు: 128; వెల: 50
ప్రతులకు: ఆనందాశ్రమ్, కేరళతోపాటుగా; అనువాదకుడు, 71, ‘శ్రీభాగ్యసుధ’, ఎల్.ఎస్.నగర్, తిరుపతి-517502. ఫోన్: 9397048771
లవంగి (శ్రీజగన్నాథ పండితరాయల చరిత్ర)
రచన: కె.వి.ఎల్.ఎన్.శర్మ
పేజీలు: 136; వెల: 100
ప్రతులకు: కంచెర్ల ప్రమీల, 20-8/2-14బి, ఐదో లైను, న్యూ అయోధ్య నగర్, జయవాడ-520003; ఫోన్: 9963668247
నాకొక శ్రీమతి కావాలి (హాస్యకథలు)
రచన: డా.మంతెన సూర్యనారాయణరాజు
పేజీలు: 136; వెల: 120
ప్రతులకు: విశాలాంధ్రతో పాటుగా, రచయిత, దివ్య రూబీ అపార్ట్‌మెంట్స్, ప్లాట్ 316, ఫ్లాట్ 302, థర్డ్ ఫ్లోర్, సిక్స్త్ ఫేజ్, కేపీహెచ్‌బి, హైదరాబాద్
నవ్వు-నవ్వించు (కథాసుధ)
రచన: షణ్ముఖశ్రీ
పేజీలు: 128; వెల: 100
ప్రతులకు: ములుగు కుమారస్వామి, ప్లాట్ 39, ఇం.నం. 2-2-1131/1/2, న్యూనల్లకుంట, హైదరాబాద్-44. ఫోన్: 8897853339
ఒక విజయం తరువాత...
విజయం ఆనందోద్వేగాలను మాత్రమే ఇవ్వదు. కొన్ని సవాళ్లను కూడా విధిగా ఇస్తుంది. వాటిని అధిగమించిన రోజే విజయానికి పరిపూర్ణత చేకూరుతుంది. ఇవ్వాళ తెలంగాణ పరిస్థితి అదే. ‘ఏం చేయాలి?’ ‘ఎట్లా చేయాలి?’ ‘ఏది చేయకూడదు?’ ఇలా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో రావాల్సిన మార్పులు, చేర్పుల గురించి ప్రస్తుతం విస్త్రృతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘నడుస్తున్న తెలంగాణ’ ప్రత్యేక సంచికను వెలువరించింది.
‘నడుస్తున్న తెలంగాణ’ విషయానికివస్తే అది తెలంగాణ ఉద్యమంతో పాటు నడిచింది. ఉద్యమం గుండె చప్పుడును రికార్డు చేసింది. ఈ సంచికలో రకరకాల కోణాలలో వరవరరావు, వేణుగోపాల్, శ్రీధర్‌దేశ్‌పాండే, మల్లేపల్లి లక్ష్మయ్య, రత్నమాల, దేవిప్రసాద్, పగడాల నాగేందర్...మొదలైన లబ్దప్రతిష్ఠులు రాసిన విలువైన వ్యాసాలు ఉన్నాయి. ప్రస్తుత సందర్భంలో వాటి ప్రాధాన్యత చిన్నదేమీ కాదు.
ఉద్యమం, సాహిత్యం, విద్య, సినిమా, నీటిపారుదల...ఇలా రకరకాల విషయాలపై రాసిన లోతైన వ్యాసాలను చదువుతున్నప్పుడు ‘భౌగోళిక తెలంగాణ’ ‘బంగారు తెలంగాణ’ కావడానికి ఇవి మార్గసూచిలా ఉపకరిస్తాయనిపిస్తుంది.
‘ఒక విజయం తరువాత... చిన్నా పెద్దా సమస్యలన్నీ వాటంతటవే రద్దయిపోతాయి’ అనే కమ్యూనిస్ట్ కాల్పనిక భ్రమకు ఇది కాలం కాదు. సంపాదకుడు కాశీం అన్నట్లు ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా, ప్రజాస్వామిక తెలంగాణ రూపొందించుకునే బాధ్యత తెలంగాణ సమాజంపై ఉంది’.
- యాకూబ్ పాషా
నడుస్తున్న తెలంగాణ (మాసపత్రిక)
సంపాదకుడు: డా. సి.కాశీం
పేజీలు: 130; వెల: 50
ప్రతులకు: స్నేహలత ఎం., క్వార్టర్ నెం: ఆర్-9, ఒ.యు. క్వార్టర్స్, ఉస్మానియా యూనివర్శిటీ. హైదరాబాద్-7;
ఫోన్: 8008918475
కొత్త పుస్తకాలు: జయుడు
Published Sun, Sep 14 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement
Advertisement