వేష్యం | Prostitute role | Sakshi
Sakshi News home page

వేష్యం

Published Sun, Sep 6 2015 1:01 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

వేష్యం - Sakshi

వేష్యం

వేశ్య పాత్రను చేయడం ఏ నటికీ అంత తేలిక కాదు. ఇంట్లో వాళ్లను, వీధిలో వాళ్లను ఫేస్ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అయినా కూడా కళ మీద మక్కువతో ఈ నటీమణులు  ఆ పాత్రను పోషించారు. ఆ పాత్రకు న్యాయం చేశారు.

స్త్రీకి... ఆమె ఉన్న స్థానాన్ని బట్టి గౌరవాన్ని ఇస్తాం. అమ్మ స్థానంలో ఉంటే మొక్కుతాం. అక్కగానో చెల్లిగానో ఉంటే అనురాగాన్ని పంచుతాం. ప్రేయసిగా ఆరాధిస్తాం. అర్ధాంగిగా వస్తే అన్నిటినీ పంచుకుంటాం. అదే అంగడిలో బొమ్మగా ఉంటే... అసహ్యించుకుంటాం. అవమానిస్తాం. అనుకోని పరిస్థితుల్లో ఆమె అలా మారిందా, అవసరార్థం అలాంటి జీవితాన్ని ఎంచుకుందా అని ఆలోచించే ప్రయత్నం కూడా చేయం.

అది చాలా తప్పు అని చెప్పే ప్రయత్నం చేశారు కొందరు సినీ దర్శకులు. సెక్స్ వర్కర్ల జీవితాల్లోని చీకటి కోణాలను, వారి వ్యథలను తమ సినిమాల ద్వారా వెలికి తీశారు. ఆ ప్రయత్నంలో వారికి తోడుగా నిలిచిన హీరోయిన్లు వీరు. నటనే అయినా కూడా ఓ సెక్స్ వర్కర్‌గా అందరి ముందూ నిలబడాలంటే ఆ నటికి ఎంతో తెగువ ఉండాలి. ఆ తెగువ చూపించి, అద్భుతంగా నటించి, మెప్పించి, మనసుల్ని మెలిపెట్టిన ఈ నటీమణులందరికీ హ్యాట్సాఫ్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement