ఇక కన్నీళ్లు లేవోచ్! | Smita Bansal back on TV for a cameo | Sakshi
Sakshi News home page

ఇక కన్నీళ్లు లేవోచ్!

Published Sun, Dec 7 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

ఇక కన్నీళ్లు లేవోచ్!

ఇక కన్నీళ్లు లేవోచ్!

సీరియళ్లలో అత్తలంటే విలన్లే. కోడలిని ఎలా రాచి రంపాన పెట్టాలి, ఎలా ఇంట్లోంచి బయటకు గెంటేయాలి అని ఆలోచించే అత్త పాత్రలే ఎక్కువ. అలాంటి సమయంలో అత్యంత ఉదాత్తమైన అత్తగా నటించి మెప్పించింది స్మితాభన్సాల్. ‘బాలికావధు’లో ఆనందికి అత్త అయివుండీ అమ్మలా సాకిన ఆమెను చూసి... ఇలాంటి అత్తగారు మాకూ వస్తే బాగుణ్ను అని ఆడపిల్లలంతా కోరుకున్నారు. సున్నిత మనస్తత్వం గల మహిళగా ఆ పాత్రలో కన్నీటిని ఒలకబోసింది స్మిత. కానీ ఇప్పుడు పంథా మార్చింది.

త్వరలో ప్రారంభం కానున్న ‘అక్బర్-బీర్బల్’ సీరియల్‌లో నవ్వుల జల్లులు కురిపించడానికి రెడీ అయ్యింది. ఇందులో అక్బర్ రెండో భార్య ఉమ్రావ్‌గా నటిస్తోంది స్మిత. ఆమె పాత్ర అత్యంత హాస్యాస్పదంగా ఉంటుందట. ‘ఇన్నాళ్లూ నన్ను చూసి కదిలిపోయారు. ఇప్పుడు కడుపుబ్బ నవ్వుకుంటారు’ అని పూర్తి విశ్వాసంతో చెబుతోందంటే... ఆ పాత్ర ఏ స్థాయిలో కామెడీని పండించబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త ప్రయోగం స్మిత కెరీర్‌ను ఎలా మార్చుతుందో మరి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement