వారఫలాలు: 18 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనుల్లో ఆటంకాలు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
అప్రయత్నంగా కొన్ని వ్యవహారాలు పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం. ఆర్థిక విషయాలు ఆశాజనకం. రుణ ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. చాక్లెట్, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. అయితే క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. రావలసిన డబ్బు అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఇతరులకు సాయ పడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. కళా రంగం వారికి సన్మానాలు, సత్కారాలు. గులాబీ, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులు ప్రతిభను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కవచ్చు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4,స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. నీలం, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కించు కుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, నృసింహస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు కలిసివచ్చే కాలం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు. నలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. సంఘంలో పేరుప్రతిష్టలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు ఊహించని విధంగా పదవులు దక్కవచ్చు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో మంచి గుర్తింపు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు