వారఫలాలు: 11 అక్టోబర్ నుంచి 17 అక్టోబర్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభను చాటుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కొంత తగ్గుతాయి. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు పదవులు. పసుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. పెండింగ్ వ్యవహారం ఒకటి అనుకూలించే అవకాశం. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుధ్యానం చేయండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
శ్రమపడ్డా ఫలితం అంతగా ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఆచి తూచి వ్యవహరించండి. అభాండాలు వేసేవారు అధికమవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు. ఎరుపు, నేరేడురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రారంభంలో పనులు చకచకా సాగినా క్రమేపీ మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణదాతల నుంచి ఒత్తిడులు. బంధువర్గంతో కలహాలు. మీపై విమర్శలు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలలో మరింత శ్రద్ధ చూపండి. భూముల కొనుగోలు విషయంలో అవరోధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. తెలుపు, బంగారు రంగులు , ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులలో అవరోధాలు నెలకొంటాయి. ఇంటా బయటా సమస్యలు. ఆలోచనలు కలసిరావు. నిర్ణయాలలో తొందరపాటు తగదు. మొత్తం మీద మౌనం అన్ని విధాలా మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా మధ్యలో కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు విధులు కత్తిమీద సాముగా మారవచ్చు. కళారంగం వారికి నిరుత్సాహం. ఎరుపు, లేత పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పట్టింది బంగారమే. ఆర్థికంగా బలపడతారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించవచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. బంధువులు, మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా ప్రోత్సాహకరం. ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా పరిష్కరించు కుంటారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తి విషయంలో ఎంతోకాలంగా నలుగుతున్న వివాదం పరిష్కారవుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. గులాబీ, లేత ఆక్కుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరం. రావలసిన సొమ్ము అందుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. గులాబి, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. ఇతరులకు సైతం సాయపడి ప్రశంసలు అందుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాల విస్తరణలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. నీలం, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విలువైన వస్తుసామగ్రిని భద్రంగా చూసుకోండి. బంధువర్గంతో లేనిపోని వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళారంగం వారికి చికాకులు. నలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్య సూచనలు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత గందరగోళం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. కళారంగం వారు పర్యటనలు వాయిదా వేసుకుంటారు. చాక్లెట్, పసుపురంగులు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు