వారఫలాలు: 25 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్, 2015 వరకు | Vaara Phalalu: 25 october from 31 october | Sakshi
Sakshi News home page

వారఫలాలు: 25 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్, 2015 వరకు

Published Sun, Oct 25 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 11:25 AM

వారఫలాలు: 25 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్, 2015 వరకు

వారఫలాలు: 25 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్, 2015 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆస్తుల కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత బయటపడతారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. చాకచక్యంగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త వ్యక్తుల పరిచయం. గతంలో నిలిచిపోయిన పనులు సైతం పూర్తి చేస్తారు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయట పడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు పదోన్నతులు. తెలుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. నీలం, పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. వివాహ, ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధుమిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు. కళాకారులకు ఉత్సాహవంతం. తెలుపు, కాఫీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ప్రముఖులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. ద్వేషించిన వ్యక్తులే ప్రశంసిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పసుపు, ముదురు ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులలో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సోదరులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంటు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని వ్యవహారాలు కొంత నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.  కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు విస్తరిస్తారు. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు. నీలం, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చనలు చేయండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధుమిత్రులతో అకారణ వివాదాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. నిర్ణయాలలో తొందరపాటు తగదు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 పనుల్లో విజయం. ఇంటా బయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు. గోధుమ, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు,జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement