ఆంధ్రా మిల్టన్‌గా, ఆంధ్రాస్కాట్‌గా పేరుప్రఖ్యాతులు పొందిన కళా ప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు సమా జసేవతోపాటు ఇటు సాహితీసేవ చేస్తూ ఆనాటి సమాజంలోని అనేక దురాచారాలపై పోరాడారు. అలా పోరాడేవారికి అండదండలందిం చారు. అందుకు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు. కందుకూరి వీరేశ లింగాన్నే తనకు స్ఫూర్తిగా తీసుకున్నారు. బాల్య వివాహాలను నిరోధించ డంలో, వితంతు వివాహాలను ప్రోత్సహించడంలో, ఇతర సామాజిక సంస్కరణలు తీసుకు రావడంలో చిలకమర్తి ముందున్నారు. తన రచ నల ద్వారా ఆర్జించిన డబ్బును పాఠశాలల స్థాపనకూ, పుస్తకాల పంపిణీకి ఆయన వినియోగించారు. ధనవంతులు స్వీయ ప్రతిష్ట కోసం సత్రాలు కట్టించి, సమారాధనలు, సంతర్పణలూ చేసే బదులు సమాజం లోని అట్టడుగు వర్గాల ప్రజల గురించి ఆలోచిం చడం లేదని చిలకమర్తి వాపోయారు.
మానవ సేవే మాధవసేవ అని సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవా నుడే చెప్పినా వీరికి పట్టదని ఆవేదన చెందారు. భాగ్యవంతులంతా నిమ్నజాతి ఉద్ధరణ కోసం తమ వంతు వెచ్చించినప్పుడే సమాజం ఉన్నత స్థితికి ఎదుగుతుందని నమ్మిన మహనీయుడాయన! దేశ స్వాతంత్య్రోద్యమంలో దక్షిణ భారత మంతటా సభలు నిర్వహించి, తన ఉపన్యాసాలతో ఆనాటి యువతను ఉర్రూతలూగించారు. ప్రజల్లో స్వరాజ్యకాంక్షను రగిలించారు. ఇంగ్లిష్ చదువులు అవసరమే గానీ, వారి ఆచారవ్యవహారాలను అనుసరించ నక్కరలేదని, మన ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం, సంప్రదాయాలు ఎంతో విలువైనవని ఆయన హితవు పలికారు. ఈనాటి యువతరానికి చిలకమర్తి స్వీయ చరిత్రతోసహా ఆయన రచనలన్నిటినీ అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి.(నేడు సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో చిలకమర్తి లక్ష్మీనరసింహం 152వ జయంతి వేడుకల సందర్భంగా)
సి.కె.ఎమ్. కుమార్, శారదానగర్, హైదరాబాద్
మొబైల్ : 99121 81379
Comments
Please login to add a commentAdd a comment