
ఫైల్ ఫోటో
మూడు రాజధానుల ముచ్చటైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని చూడాలనుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఒక వినూత్నమైన ఆలోచన. ఆంధ్ర మహావిష్ణువు పాలనలో మన రాష్ట్రం ఒకప్పుడు మూడు వైపులా మూడు శైవక్షేత్రాల (లింగాల) నడుమ రాజ్యంగా విస్తరించి త్రిలింగ రాజ్యంగా పేరొం దింది. కోస్తాలో ద్రాక్షారామం, సీమలో శ్రీశైలం, ప్రస్తుత తెలంగాణాలో కాళేశ్వరం అవి. ఇప్పుడు ఏపీలో మూడు చోట్ల మూడు విభాగాల రాజధానులు నెలకొల్పాలనుకోవడం కొట్టిపారెయ్యదగ్గ ఆలోచన ఎంతమాత్రం కాదు. లోతుగా చర్చించి గమనంలోకి తీసుకోదగ్గది.
గత సీఎం బాహుబలి స్థాయి ఏకైక అంతర్జాతీయ మహానగరం రాజధానిగా కలగంటే, నేటి యువ ముఖ్యమంత్రి బహుళ నగరాల్ని రాజధానులుగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తే బాగుంటుం దని భావిస్తున్నారు. అధికార వికేం ద్రీకరణ, అభివృద్ధి కార్యక్రమాల వికేంద్రీకరణ అన్నవి మంచి ఆదర్శాలే. ఆచరింపదగ్గవే.
ఐతే అంతర్జాతీయ నగరం స్థాయి ప్రచారం పొందిన నగరం అతిమామూలు స్థాయికి మిగిలితే కలగబోయే నష్టమెంత, లేదా జరుగుతూన్న నష్టనివారణ ఏమేరకు అన్నది మదింపు జరగాలి. ఆదా మార్గాలూ, ఆదాయ మార్గాలూ ఎలా ఉండబోతున్నాయి, ఆయా పట్టణాలపై, ప్రాంతాలపై ఏయే ప్రభావాలు, ఏమేరకు అన్నది చర్చించాలి. వాస్తవానికి అసలు ఈ డిజిటల్ యుగంలో రాజధాని పరి మాణంగానీ, ప్రాంతంకానీ సమ స్యేకాదు. అమెరికాలో కూర్చుని అనకాపల్లిలో వ్యాపారం చెయ్యొచ్చు.
పారిస్‌లో కూర్చొని పలాసలో వ్యవహారం నడపొచ్చు. ఇక పాలనా వ్యవహారాలు ఏమూల కూర్చొని ఏమూలనైనా జరపొచ్చు. అయితే ముఖ్యకేంద్రాలన్నవి మా ప్రాంతాలకూ ఉన్నాయి అన్న భరోసా ప్రాంతాల మధ్య వివక్షని తగ్గిస్తుంది. ఒక రాష్ట్రానికి పాలనా రాజధాని, న్యాయ రాజధాని, శాసన రాజధాని వేర్వేరుగా ఏర్పరిచే ఆలోచన మే«ధోమథనం చేయదగ్గది.
– డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment