కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో పుట్టి జాతీయ, అంతర్జాతీయ పరిధుల్లో న్యాయశాఖలో అత్యున్నత పదవులను అలంకరించిన పీసీ రావు ఒక తెలుగు తేజం. చట్టపరమైన పరిజ్ఞానం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, న్యాయం పట్ల నిబద్ధత, వృత్తిపరమైన క్రమశిక్షణ పీసీ రావును అగ్రభాగాన నిలబెట్టాయి. విధులను అంకితభావంతో నిర్వహించడం పీసీ రావు వ్యక్తిత్వం. పాలనాధికారిగా ఉంటూ న్యాయపాలన చేయడం, అంతర్జాతీయ న్యాయ శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం, కొత్త పరిష్కార మార్గాలు అన్వేషించడం ద్వారా మరిచిపోలేని మంచి వ్యక్తిగా ఆయన మన జ్ఞాపకాల్లో మిగిలిపోయారు.
ఏళ్లు గడచినా వాయిదాలు పడుతూ పరిష్కారం దొర కని కోట్లాది కేసులకు దారే దైనా ఉందా అని ఆలోచించి ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ చట్టం (మధ్యవర్తిత్వ ఒప్పంద చట్టం) రూపకల్ప నలో కీలకపాత్ర పోషించిన న్యాయవేత్త పాటిబండ్ల చంద్రశేఖరరావు. ప్రత్యామ్నాయ పరిష్కారాల వేది కలను ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతం చేయడం పీసీ రావు చేసిన గొప్ప సేవ. ఆయన ఐసీఏడీఆర్ (అంతర్జాతీయ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార కేంద్రం) సెక్రెటరీ జనరల్‌గా ఈ ఉద్యమాన్ని ముందుండి విజయవంతంగా నడిపారు. కోర్టు కేసుల్లో 60 శాతం సమస్యలు ఇరు పక్షాలూ పరిష్క రించుకోతగినవే. కాని వారి మధ్య చర్చలకు ప్రోత్స హించేవారు లేరు. కార్పొరేట్ వివాదాలకు రాజ్యాంగ పరమైన న్యాయపోరాటాలు అవసరం లేదు. రెండు కంపెనీల ప్రతినిధులు ఒక పెద్దమనిషి దగ్గర కూర్చుని తమ తగాదాలపై అంగీకారానికి రాదలచు కుంటే ఎవరూ ఆపలేరు. వారి రాజీకి డిక్రీ స్థాయి కల్పించి మళ్లీ అప్పీలు లేకుండా దాన్ని అమలు చేసే చట్టం తేవడం వెనుక ప్రధాన కృషి పీసీ రావుది. సివిల్ ప్రొసీజర్ కోడ్‌లో సవరణల ద్వారా ప్రత్యా మ్నాయ పరిష్కారాలకు చట్టబద్ధత కల్పించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాల కోసం ఒక చట్టాన్ని పార్లమెంటు చేయడానికి కూడా పీసీ రావు బాధ్యత వహించారు.
పెద్ద కంపెనీల వివాదాలు పరిష్కరించడానికి కోర్టు ముందున్న కేసులన్నీ పక్కన బెట్టాలి. అది సాధ్యం కాదు. డబ్బుకు సమస్యలేని ఈ కంపెనీలు తామే ఒక పెద్దమనిషిని లేదా మాజీ న్యాయమూర్తిని మధ్యవర్తిగా నియమించుకుని తమ కేసును ప్రయి వేటు కోర్టులో విచారణ జరిపించడం అంతర్జాతీ యంగా ఆమోదయోగ్యమైన ప్రక్రియ. ప్రపంచీకరణ తర్వాత వాణిజ్యానికి పెండింగ్ కేసుల వల్ల అవరో ధాలు కలగకుండా ఉండాలంటే మధ్యవర్తిత్వమే ప్రత్యామ్నాయమని అన్ని దేశాలు అంగీకరించాయి. అందులో భారత పక్షాన íపీసీ రావు నిలబడి ఈ విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టారు.
మధ్యవర్తిత్వంతో పాటు ఇతర వివాదాల పరి ష్కారానికి మధ్యవర్తి ముందు సంప్రదింపులు జర పడం అనే మరో ప్రక్రియ కూడా ప్రారంభించారు. దీన్ని రాజీ ఒప్పందం అని కూడా పిలుస్తారు. సంప్ర దింపు అనే మరో ప్రక్రియలో తగాదాలోని ఇరు పక్షాలూ ఒక చోట కూర్చుని చర్చించుకుంటారు. ఇందుకు ఇరు పార్టీలకు సానుకూల వాతావరణం కల్పించే విధానం కూడా ఈ ప్రత్యామ్నాయ పద్ధ తుల్లో ఒకటి. వివాదం కోర్టుకు వెళ్లాక ప్రత్యామ్నాయ పరిష్కార వేదికలకు తగాదాను పంపే బాధ్యతను న్యాయాధికారికి అప్పగిస్తూ సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను ఆ తరువాత సవరించారు. ఈ కీలక మార్పునకు ప్రేరణ పీసీ రావే. భారత ప్రధాని పీవీ నరసింహా రావు హయాంలో ఆయన కేంద్ర న్యాయశాఖ కార్య దర్శిగా పనిచేశారు. అనవసరమైన ప్రచారం లేకుండా పనులు సాధించడంలో పీవీ నరసింహా రావు నైపుణ్యం తెలిసిందే. దీని వెనుక పీవీఆర్‌కే ప్రసాద్, పాటిబండ్ల చంద్రశేఖర రావు వంటి సలహా దారుల కృషి ఉంది. బాబ్రీ మసీదును కూల్చి ఉండక పోతే చర్చలు సఫలమై పరిష్కారం దొరికి ఉండేది కాదని పీసీ రావు ఆ తరువాత తన అనుభవాలను వివరించారు. కె. రామచంద్రమూర్తి (‘సాక్షి’ ఎడిటో రియల్ డైరెక్టర్)తో కలిసి ఈ వ్యాస రాచయిత పీసీ రావును సుదీర్ఘంగా ఇంటర్వూ్య చేసినపుడు ఈ వివ రాలను పీసీ రావు మాతో పంచుకున్నారు.
చిత్తశుద్ధితో, స్వార్థం లేకుండా చేస్తున్న ఉద్యో గంలో విధులను అంకితభావంతో నిర్వహించడం పీసీ రావు వ్యక్తిత్వం. పాలనాధికారిగా ఉంటూ న్యాయపాలన చేయడం, అంతర్జాతీయ న్యాయ శాస్త్రాన్ని కూలంకషంగా అధ్యయనం చేయడం, కొత్త పరిష్కార మార్గాలు అన్వేషించడం ద్వారా మరిచి పోలేని మంచి వ్యక్తిగా మన జ్ఞాపకాల్లో మిగిలిపో యిన చంద్రశేఖరరావుకు నా నివాళి. ఆయన పేరెన్ని కగన్న న్యాయశాస్త్ర కోవిదుడు. అంతర్జాతీయ న్యాయ స్థానంలో సుదీర్ఘ కాలం న్యాయమూర్తిగా ఉన్న సము ద్రన్యాయ శాస్త్ర నిపుణుడు. కృష్ణా జిల్లా వీరులపాడు గ్రామంలో పుట్టి జాతీయ, అంతర్జాతీయ పరిధుల్లో న్యాయశాఖలో అత్యున్నత పదవులను అలంకరిం చిన పీసీ రావు ఒక తెలుగు తేజం. ఆయన చట్ట పరమైన పరిజ్ఞానం, ఆంగ్ల భాషా ప్రావీణ్యం, న్యాయం పట్ల నిబద్ధత, వృత్తిపరమైన క్రమశిక్షణ పీసీ రావును అగ్రభాగాన నిలబెట్టింది. 2012లో పద్మ భూషణ్ గౌరవాన్ని అందుకున్న న్యాయశాస్త్రవేత్త ఆయన. మద్రాసు యూనివర్సిటీలో బీఏ పట్టాను, ఎల్‌ఎల్‌బీ పట్టాను పొందిన పీసీ రావు ఆ తరువాత స్నాతకోత్తర పట్టాను, డాక్టరేట్‌ను సాధించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లాలో ఆయన 1963 నుంచి 67 దాకా పరిశోధనలు చేశారు. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్యోగంలో చేరారు. లీగల్ అండ్ ట్రీటీస్ డివిజన్‌లో సహాయ సలహాదారుడిగా పనిచేశారు. 1972లో అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్, పాక్ మధ్య ఒక వివాదంలో ఐసీఏఓ అధికార పరిధి గురించి పీసీ రావు ప్రతిభావంతంగా వాదించారు. దీని ఆధా రంగా నాలుగేళ్లపాటు పీసీ రావును ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ భారత పర్మనెంట్ మిషన్‌లో న్యాయ సలహాదారుడిగా భారత ప్రభుత్వం నియమించింది. 1996 అక్టోబర్ నుంచి సుదీర్ఘ కాలం ఆయన జర్మనీ లోని హాంబర్గ్‌లో సముద్ర న్యాయశాస్త్రానికి చెందిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ న్యాయమూర్తిగా పనిచే శారు. 1999 నుంచి 2002 దాకా ఆయన ఈ ట్రిబ్యు నల్‌కు చైర్మన్‌గా నాయకత్వం వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్న బ్రెడ్ అనే సంస్థలో డాక్టర్ ఎన్. భాస్కర రావు, కె.రామచంద్రమూర్తి, కాకాని రామ మోహన్ రావు ప్రభృతులతో పీసీ రావు, పుష్ప భార్గవ కలిసి పనిచేశారు.
ఆంగ్ల భాషలో అంతర్జాతీయ న్యాయశాస్త్రంపై అనేక పుస్తకాలు రచించారాయన. ద న్యూ లా ఆఫ్ మారిటైమ్ జోన్స్, 1982, భారత రాజ్యాంగం– అంతర్జాతీయ చట్టాలు, 1993, ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ చట్టం 1996, ఏ కామెంటరీ, 1997, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలు: అంటే ఏమిటి? ఏ విధంగా పనిచేస్తాయి?, 1996, ది ఇంట ర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ: ఏ కామెం టరీ, 2000, ద రూల్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రిబ్యు నల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ: ఏ కామెంటరీ, 2006 గ్రంథాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న పుస్తకాలు. ఈ అంశాలపైన వీటిని మించినవి లేవు.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment