ఓ ప్రైవేటు బస్సులో 52 కిలోల వెండి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఓ ప్రైవేటు బస్సులో 52 కిలోల వెండి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో గోవా నుంచి లిక్కర్ రవాణా అవుతుందన్న సమాచారంతో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం రాయికల్ టోల్ ప్లాజ్ వద్ద ఎక్సైజ్ అధికారులు మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బస్సులో ఒక ప్రయాణికుడు 52 కిలోల వెండి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని జడ్చర్ల వాణిజ్య పన్నుల శాఖ అధికారి వద్దకు తరలించారు.