రంగారెడ్డి జిల్లా శంషాబాద్-రాజేంద్రనగర్ మార్గంలో ఔటర్‌రింగ్ రోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఓ కారు నిలువునా దగ్ధమైంది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్-రాజేంద్రనగర్ మార్గంలో ఔటర్‌రింగ్ రోడ్డుపై శనివారం మధ్యాహ్నం ఓ కారు నిలువునా దగ్ధమైంది. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న బెంజ్ కారు(Ts 07 EX 8055) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటల్లో తీవ్రంగా గాయపడిన ఒక మహిళను ట్రైడెంట్ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.