కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా రామచంద్ర కుంతియాను అధిష్టానం నియమించింది.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా రామచంద్ర కుంతియాను అధిష్టానం నియమించింది. ఆగస్టు 8వ తేదీన వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆయనకు అధిష్టానం లేఖ పంపింది. సహజంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శికి మాత్రమే సీడబ్యూసీ సభ్యులుగా అవకాశం ఇస్తారు. అయితే ప్రధాన కార్యదర్శిగా కుంతీయాను నియమించకున్నా, ఆయనకు సీడబ్యూసీలో అవకాశం ఇవ్వడంతో త్వరలోనే ఆయనకు ప్రధాన కార్యదర్శిగా కూడా నియమిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
దీంతో కుంతీయానే రాబోయే రోజుల్లో తెలంగాణకు దీర్ఘకాల ఇంచార్జ్గా ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు కార్యదర్శిగా ఉన్న కుంతీయాను ప్రధాన కార్యదర్శిఇంచార్జ్గా నియమించిన ఏఐసీసీ దీర్ఘకాలికంగా కొనసాగిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పదవి నుంచి దిగ్విజయ్ సింగ్‌ను తొలగించిన విషయం తెలిసిందే.