ప్రేమికుల ఆత్మహత్యాయత్నం: ప్రియురాలి మృతి | lovers attempt suicide in kurnool district | Sakshi
Sakshi News home page

ప్రేమికుల ఆత్మహత్యాయత్నం: ప్రియురాలి మృతి

Published Sat, Nov 21 2015 11:59 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 PM

lovers attempt suicide in kurnool district

కర్నూలు: తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే మనస్ధాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ప్రియురాలు చనిపోగా, ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్నూలు జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వహీదా, మధు ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భయంతో ఇద్దరూ తమ ఇళ్లలోనే శుక్రవారం రాత్రి పురుగుమందు తాగారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులు చూసేసరికి వహీదా మృతి చెందింది. మధును తల్లిదండ్రులు బనగానిపల్లె ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement