మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం | maoists dump-caught-in-east-godavari-district | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

Published Sat, Dec 5 2015 9:25 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

maoists dump-caught-in-east-godavari-district

చింతూరు: ఛత్తిస్‌గఢ్ రాష్ట్రంలోని కన్‌కేర్ జిల్లా భానుప్రతాప్‌పూర్ డివిజన్ పరిధిలోని తడోకి పెదబేడ అటవీ ప్రాంతంలో భారీ డంప్ లభ్యమైంది. శనివారం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన పోలీసులు డంప్ ను గుర్తించారు. అడవిలోని ఓ కాలువ గట్టుపై దాచి ఉంచిన 4 టిఫిన్ బాక్స్ బాంబులు, 11 బార్మర్ తుపాకులు, 2 పిస్టల్స్, భారీ ఎత్తున డిటోనేటర్‌లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. డంప్ బయటపడిన నేపధ్యంలో పోలీసులు కూంబింగ్ ను ముమ్మరం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement