ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకుంది.
ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గాజువాక మండలంలోని అక్కిరెడ్డిపాలెంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్నా వద్ధాటి దేవుడమ్మ(25) ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పని నిమిత్తం నవ్య న్యూలైఫ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అక్కడే యజమాని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అనుమానస్పద మృతిగా కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.