చీరాల చేరుకున్న నిర్మలా సీతారామన్ | nirmala sitharaman visits prakasam district | Sakshi
Sakshi News home page

చీరాల చేరుకున్న నిర్మలా సీతారామన్

Published Fri, Sep 18 2015 8:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

చీరాల చేరుకున్న నిర్మలా సీతారామన్ - Sakshi

చీరాల చేరుకున్న నిర్మలా సీతారామన్

ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలాసీతారామన్ చీరాల చేరుకున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతులను ఆమె పరామర్శించనున్నారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు ప్రాంతాలలోని పొగాకు వేలం కేంద్రాలను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పరిశీలిస్తారు.

కాగా ఈ రోజు ఉదయం చీరాల రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆమెను రాష్ట్ర బీజేపీ నేతలు కలిశారు. నామినేటెట్ పదవుల్లో బీజేపీ కార్యకర్తలకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయంపై చర్చించాలని నిర్మలాసీతారామన్ కు వినతి పత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement