
మతబోధకుడికి జీవితఖైదు
ప్యోంగ్ యాంగ్: దక్షిణ కొరియా, అమెరికాల సహకారంతో దేశంలో అలజడులు సృష్టించి, ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించాడన్న ఆరోపణలపై ఓ మత గురువుకు జీవితఖైదు విధించింది ఉత్తరకొరియా.
60 ఏళ్ల హెయాన్ సూ లిమ్ అనే మతబోధకుడు.. గడిచిన 18 ఏళ్లుగా వరుస కుట్రలు పన్నుతూ ఉత్తర కొరియాను ఆగంపట్టించేందుకు ప్రయత్నించాడని, నేరం నిరూపణ అయినందున జీవితఖైదు విదించినట్లు ప్యోంగ్ యాంగ్ ప్రభుత్వ వర్గాలు బుధవారం ప్రకటించాయి.