తెలంగాణ వ్యాప్తంగా బ్రెయిలీ పాఠశాలలకు బ్రెయిలీ పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేసినట్టు బ్రెయిలీ ప్రెస్ మేనేజర్ రమేశ్ మంగళవారం తెలిపారు. అలాగే సర్వ శిక్షాభియాన్ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బ్రెయిలీ పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేసినట్లు చెప్పారు.
ఇప్పటి వరకు 2,320 క్యాలెండర్‌లు, 2,500 పుస్తకాలు తయారు చేసినట్లు తెలిపారు. జిల్లాల ఉపాధ్యాయులు సర్వ శిక్షాభియాన్ ద్వారా ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా నార్వే దేశం నుంచి దాదాపు రూ.30 లక్షల విలువ గల ప్రింటర్‌లు కొనుగోలు చేస్తున్నట్లు రమేశ్ తెలిపారు. దీనివల్ల పుస్తకాలను కొరత లేకుండా సరఫరా చేస్తామన్నారు.