హైదరాబాద్:
వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ చిన్నారికి అపొలో ఆసుపత్రి వైద్యులు అతి క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి వేగంగా కోలుకుంటోంది. వైద్యులు తెలిపిని వివరాలివీ.. పార్వతి రొహ్రా(5) జన్యు సంబంధమైన అలగిల్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. కేవలం పది కిలోల బరువున్న బాలికకు లివర్ సిర్రోసిస్, పూర్తిగా శరీర ఎదుగుదల లోపించటం, రికెట్స్ వ్యాధి వంటి చాలా సంక్లిష్టమైన సమస్యలున్నాయిని వైద్యులు తెలిపారు.
లక్షమందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి కారణంగా గుండె, కాలేయ సంబంధ వ్యాధులు తలెత్తాయి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు జనవరి 23వ తేదీన ముందుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అనంతరం ఆమె తల్లి లివర్ నుంచి చిన‍్న భాగాన్ని సేకరించి పార్వతికి అమర్చారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది ఒక మైలురాయి వంటిదని పేర్కొన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణతో కోలుకున్న ఆమెను ఫిబ్రవరి ఏడో తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆమె వయస్సుకు తగ్గట్లుగా ఎదిగేందుకు, రికెట్స్ నుంచి బయటపడేందుకు విటమిన్ డి సప్లిమెంట్స్‌ను ఇస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో బాలిక పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు వివరించారు.
ఐదేళ్ల చిన్నారికి లివర్ మార్పిడి
Published Thu, Feb 23 2017 5:18 PM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM
Advertisement