Cardiac surgery
-
చిట్టి గుండెకు గట్టి అండ
లక్డీకాపూల్: అంతర్జాతీయ ప్రమాణాలతో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తున్న నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) ఇక నుంచి నవజాత శిశువులకు సైతం హృద్రోగ శస్త్రచికిత్సలు చేయనుంది. పుట్టుకతో ఏర్పడే గుండె సమస్యలకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనుంది. జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్, సువెన్ ఫార్మాసూటికల్స్ సహకారంతో రూ. 5 కోట్లతో నిమ్స్‌లో నూతనంగా నవజాత హృదయ సంబంధ శస్త్రచికిత్సల విభాగం (పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్) ఏర్పాటైంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ విభాగాన్ని ఇటీవల ప్రారంభించారు. 50 పడకలు.. ఆధునిక సదుపాయాలు 50 పడకలతో కూడిన పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జరీ యూనిట్ విభాగంలో 6 పడకల అత్యాధునిక మాడ్యులర్ కార్డియోథొరాసిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) కూడా ఉంది. నవజాత శిశువుల్లో గుండె మార్పిడి కోసం అనువైన క్లాస్–1 ఎయిర్ కండిషన్డ్ ఐసొలేషన్ వార్డును సైతం నిమ్స్ సమకూర్చుకుంది. అతిసూక్ష్మమైన వైరస్, బ్యాక్టీరియాలను తొలగించే ఆధునిక హెప్పా ఫిల్టర్లు ఉండటం ఈ వార్డు ప్రత్యేకత. అంతేకాకుండా నెలలు నిండని, తక్కువ బరువుతో పుట్టే పిల్లలకు వెచ్చదనం ఇచ్చే వార్మర్లు తదితర సదుపాయాల కోసం పీడియాట్రిక్, నియోనాటల్ సామర్థ్యాలను కూడా నిమ్స్ అందుబాటులోకి తెచ్చింది. శస్త్ర చికిత్సల సమయంలో శరీరంలో చోటుచేసుకొనే మార్పులను పసిగట్టి వైద్యులను ముందే హెచ్చరించే అధునాతన కార్డియాక్ అవుట్‌పుట్ మానిటర్‌ను సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పిల్లల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చే నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా యంత్రాన్ని సమకూర్చారు. రూ.40 లక్షలతో హార్ట్ లంగ్ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫస్ట్.. నిమ్స్ తరహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. నవజాత శిశువుల్లో పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు ఏర్పడినప్పుడు శస్త్రచికిత్సలు చేయడానికి ఈ విభాగం ఎంతో ఉపయోగపడుతుంది. – డాక్టర్ ఎం. అమరేష్‌రావు, నిమ్స్ సీటీ సర్జన్ (చదవండి: -
ఐదేళ్ల చిన్నారికి లివర్ మార్పిడి
హైదరాబాద్: వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ చిన్నారికి అపొలో ఆసుపత్రి వైద్యులు అతి క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి వేగంగా కోలుకుంటోంది. వైద్యులు తెలిపిని వివరాలివీ.. పార్వతి రొహ్రా(5) జన్యు సంబంధమైన అలగిల్ సిండ్రోమ్‌తో బాధపడుతోంది. కేవలం పది కిలోల బరువున్న బాలికకు లివర్ సిర్రోసిస్, పూర్తిగా శరీర ఎదుగుదల లోపించటం, రికెట్స్ వ్యాధి వంటి చాలా సంక్లిష్టమైన సమస్యలున్నాయిని వైద్యులు తెలిపారు. లక్షమందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధి కారణంగా గుండె, కాలేయ సంబంధ వ్యాధులు తలెత్తాయి. చిన్నారిని పరీక్షించిన వైద్యులు జనవరి 23వ తేదీన ముందుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అనంతరం ఆమె తల్లి లివర్ నుంచి చిన్న భాగాన్ని సేకరించి పార్వతికి అమర్చారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే ఇది ఒక మైలురాయి వంటిదని పేర్కొన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణతో కోలుకున్న ఆమెను ఫిబ్రవరి ఏడో తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆమె వయస్సుకు తగ్గట్లుగా ఎదిగేందుకు, రికెట్స్ నుంచి బయటపడేందుకు విటమిన్ డి సప్లిమెంట్స్‌ను ఇస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో బాలిక పూర్తిగా కోలుకుంటుందని వైద్యులు వివరించారు. -
ఆసుపత్రి నుంచి లాలూ డిశ్చార్జి
ముంబయి: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌ను డిశ్చార్జి చేసినట్లు ఆ ఆసుపత్రి వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ రామాకాంత్ పండా శనివారం వెల్లడించారు. గుండెకు శస్త్ర చికిత్స జరిగిన లాలూ ప్రసాద్ యాదవ్ చాలా త్వరగా కొలుకున్నారని చెప్పారు. ఆయనకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంత కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టులో ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. గత నెల 27వ తేదీన ఏషియన్ ఇనిస్టిట్యూట్ వైద్యులు లాలూకు గుండెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.