గ్రేటర్కు రూ.112 కోట్లు!
మూడు రోజుల్లో భారీగా పన్ను ఆదాయం
రూ.210 కోట్ల విద్యుత్ చార్జీల వసూలు
జీహెచ్‌ఎంసీకి రూ.112 కోట్ల ఆదాయం..
పాత నోట్లతో చెల్లింపులకు నేడు ఆఖరు
సాక్షి, హైదరాబాద్: పాత రూ.500, రూ.1,000 నోట్లతో పన్నులు, చార్జీలు, జరిమానాల చెల్లింపులకు కల్పించిన అవకాశానికి తొలి రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించగా.. ఆదివారం చెల్లింపులు తగ్గాయి. సోమవారం కూడా పాత నోట్లను స్వీకరించనున్నారు.
‘గ్రేటర్’కు రూ.112 కోట్ల ఆదాయం..
గత మూడు రోజుల్లో జీహెచ్‌ఎంసీకి ఆస్తి పన్నులు, లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) ఫీజుల రూపంలో రూ.112 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్క రోజే రూ.26 కోట్ల ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులొచ్చాయి. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు పాత నోట్లతో పన్నులు, చార్జీలను చెల్లించవచ్చని జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూడా మూడు రోజుల్లో రూ.25 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేశారుు.
తగ్గిన విద్యుత్ చార్జీల చెల్లింపులు..
గడిచిన మూడు రోజుల్లో రూ.210 కోట్ల విద్యుత్ చార్జీలు వసూలయ్యారుు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లభ్యత లేక ఆదివారం చాలామంది చార్జీలు చెల్లించలేదని ఓ అధికారి తెలిపారు.
పంచాయతీల్లో రూ.16 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో రూ.16 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలైంది. పాత నోట్లతో పన్ను చెల్లించేందుకు కేంద్రం కల్పించిన అవకాశాన్ని గ్రామీణులు సద్వినియోగం చేసుకుంటున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ మూడు రోజులుగా ఆస్తి పన్ను బకారుులను చెల్లించేందుకు బారులు తీరుతున్నారు. శుక్రవారం రూ.8.16 కోట్లు, శనివారం రూ.4.49 కోట్లు, ఆదివారం రూ.3.76 కోట్ల మేర వసూలయ్యాయి.
పాత నోట్లతో చలాన్లు కట్టొచ్చు
పాత పెద్ద నోట్లను వినియోగించి పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేం దర్‌రెడ్డి వెల్లడించారు. 48 గంటల పాటు ఈ అవకాశం ఉం టుందని, సోమవారం సాయంత్రంలో గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. వాహనచోదకులు తమ పెండింగ్ ఈ-చలాన్లను ఈ-సేవ, మీ-సేవ సెంటర్లతో పాటు బిల్ డెస్క్, ఆం ధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌లలో చెల్లించొచ్చని తెలిపారు.