
విమానాశ్రయంలో 2.4 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 2.4 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 2.4 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన విమానంలోని ఓ ప్రయాణికుడు గ్రీన్ ఛానల్ ద్వారా వెళుతుండగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అతడి లగేజీలో 2 కేజీల 400 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితుడిని నగరంలోని పాతబస్తీకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం.