అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం అతన్ని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.