- రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద తక్షణమే 4 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలంగాణ ప్రభుత్వానికి సోమవారం లేఖ రాశారు. ఈ నెల 20న జరిగిన త్రిసభ్య కమిటీ భేటీలో చర్చకొచ్చిన కొన్ని అంశాలను లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) నుంచి 2 టీఎంసీలకుపైగా నీటిని వినియోగించుకుందని గుర్తుచేశారు.
శ్రీశైలంలో పెరిగిన నీటిమట్టం
కర్ణాటకలోని జలాశయాల నుంచి జూ రాలకు వస్తున్న ప్రవాహాలతో ప్రాజెక్టు పూర్తి సామర్థ్యానికి చేరడంతో ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోంది. దీంతో జూరాల దిగువనున్న శ్రీశైలానికి నీరు వచ్చి చేరుతోంది. సోమవా రం సైతం శ్రీశైలానికి 31,692 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగాయి. దీంతో ప్రాజె క్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.81 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 28.29టీ ఎంసీల నీటి లభ్యత ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం అందులో 9.28 టీఎంసీల నిల్వ ఉంది.
ఏపీకి తక్షణమే 4 టీఎంసీలు
Published Tue, Jul 26 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
Advertisement
Advertisement