ఉంగరం కోసం కిడ్నాప్..! | 4 year old boy kidnapped for Gold ring | Sakshi
Sakshi News home page

ఉంగరం కోసం కిడ్నాప్..!

Published Mon, Dec 21 2015 6:06 PM | Last Updated on Sun, Sep 3 2017 2:21 PM

సోమవారం మధ్యాహ్నం నగరంలో కలకలం రేపిన కిడ్నాప్ ఘటన చిన్నారి వేలికి ఉన్న బంగారు ఉంగరం కోసం జరిగిందని స్పష్టం అయింది.

హైదరాబాద్ : సోమవారం మధ్యాహ్నం నగరంలో కలకలం రేపిన కిడ్నాప్ ఘటన చిన్నారి వేలికి ఉన్న బంగారు ఉంగరం కోసం జరిగిందని స్పష్టం అయింది. చింతల సాయినగర్ కాలనీకి చెందిన సాయి నవదీప్(4) అనే చిన్నారిని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు మూడు గంటల అనంతరం సుచిత్ర వద్ద వదలివెళ్లారు.

బాబు కిడ్నాప్ కావడానికి ముందు చేతి వేలికి ఉన్న ఉంగరం మాయమవడంతో.. బంగారం కోసమే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసులు సీసీ టీవీ ఫుటేజిల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలుడికి సరిగ్గా మాటలు రాకపోవడంతో.. కిడ్నాపర్ల వివరాలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement