800 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం
మహిళల రక్షణ కోసం జంటనగరాల్లో ఏర్పాటుచేసిన షీటీమ్స్ వల్ల గత రెండేళ్లలో మహిళలపై నేరాలు 20 శాతం మేర తగ్గాయని ఏసీపీ స్వాతి లక్రా చెప్పారు. షీ టీమ్స్ ఏర్పాటుచేసి సోమవారానికి సరిగ్గా రెండేళ్లు అయిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు 800 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, వారిలో 222 మంది మైనర్లు కాగా, 577 మంది మేజర్లని తెలిపారు.
ఇద్దరిపై పీడీయాక్ట్, 40 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. 41 మంది జైలుకు వెళ్లారని, 242 మందికి జరిమానాలు విధించారని చెప్పారు. 392 మందిని కౌన్సెలింగ్ నిర్వహించి వదిలేసినట్లు స్వాతిలక్రా వివరించారు.