![ఢిల్లీ విధానం అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ](/styles/webp/s3/article_images/2017/09/3/81421613754_625x300.jpg.webp?itok=mh5HAkhr)
ఢిల్లీ విధానం అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ తరహా మల్టీ మోడల్ ట్రాన్సిట్ విధానాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. ఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ప్రజా రవాణా వాహనాల్లో ట్రాకింగ్ విధానం, జీపీఎస్ ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది.
రవాణా శాఖ సెక్రటరీ ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు, మరో ఏడుగురు అధికారులు సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీ, ఇతర అధికారులను సభ్యులుగా నియమించారు.