
సమగ్ర విచారణ జరిపించాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ కుంభకోణాలపై తూతూ మంత్రంగా విచారణ జరిపితే న్యాయం జరగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ స్కాంల వెనక ఎవరెవరున్నారో వెలికి తీయకపోతే సీఎం కేసీఆర్ తప్పు చేసిన వారవుతారని, సమగ్ర విచారణ జరిపించడం ద్వారా సీఎం చిత్తశుద్ధి నిరూపించుకో వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఒక్కగజం కూడా అన్యాక్రాంతం కాలేదంటే ఎలా అని ప్రశ్నించారు. లోపభూయిష్టమైన రెవెన్యూ చట్టాలను మార్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోని కారణంగానే కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ విషయంలో ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇచ్చినా కేసీఆర్ పెడచెవిన పెట్టారని ఆరోపించారు.