పాసయింది.. పావు శాతమే | A decline in the percentage of qualified TET Paper -2 | Sakshi
Sakshi News home page

పాసయింది.. పావు శాతమే

Published Sat, Jun 18 2016 3:14 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

పాసయింది.. పావు శాతమే

పాసయింది.. పావు శాతమే

టెట్ పేపర్-2లో బాగా తగ్గిపోయిన అర్హుల శాతం
 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్-2లో కేవలం పావు శాతం మందే అర్హత సాధించారు. సోషల్, మ్యాథ్స్-సైన్స్ విభాగాల్లో కలిపి ఈ పరీక్షకు 2,74,261 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,51,906 మంది హాజరయ్యారు. ఇందులో 63,079 మంది (25.04 శాతం) మాత్రమే అర్హత సాధించారు. ఇక పేపర్-1 పరీక్షకు 1,01,216 మంది దరఖాస్తు చేసుకోగా 88,661 మంది హాజరయ్యారు. అందులో 48,278 మంది (54.45 శాతం) అర్హత సాధిం చారు. రాష్ట్రవ్యాప్తంగా మే 22న నిర్వహించిన టెట్ ఫలితాలను పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ శుక్రవారం విడుదల చేశారు.

ఉపాధ్యా య పోస్టుల భర్తీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్నందున ఎక్కువ అభ్యర్థు లు పరీక్షకు హాజరయ్యారని ఆయన తెలి పారు. అభ్యర్థులకు సంబంధం లేని సబ్జెక్టులను సిలబస్‌లో పెట్టారన్న దానిపై ప్రశ్నిం చగా... జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారమే ఈ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన అంశాలతో టెట్ పరీక్ష నిర్వహించాలన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలేమీ పెట్టలేదని కిషన్ వివరించారు. ప్రశ్నలు కఠినంగా ఇస్తున్నారన్న అంశంపై స్పంది స్తూ... అభ్యర్థులు మరింతగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉందని సూచించారు. మరో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెట్ డెరైక్టర్ ఎస్.జగన్నాథరెడ్డి, పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్లు గోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, జాయింట్ డెరైక్టర్ శ్రీహరి, టెట్ డిప్యూటీ డెరైక్టర్ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. ఈసారి టెట్ రాసిన అభ్యర్థులు ఈనెల 21వ తేదీ నుంచి రూ.15 చెల్లించి తమ ఓఎంఆర్ జవాబుల పత్రం కాపీని వెబ్‌సైట్ ్టట్ట్ఛ్ట.ఛిజజ.జౌఠి.జీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 పురుషులు, మహిళలవారీగా..
 టెట్ పేపర్-1కు 37,799 మంది పురుషులు హాజరుకాగా 22,553 మంది (59.67 శాతం).. బాలికలు 50,862 మంది హాజరుకాగా 25,725 మంది (50.58 శాతం) అర్హత సాధించారు. ఇక పేపర్-2లో సోషల్, మ్యాథ్స్-సైన్స్ విభాగాల్లో కలిపి 1,11,910 మంది పురుషులు హాజరుకాగా 35,2105 మంది (31.45 శాతం).. బాలికలు 1,39,996 మంది హాజరుకాగా 27,864 మంది (19.90 శాతం) మాత్రమే అర్హత సాధించారు.

 3,893 మంది ఫలితాలు నిలిపివేత
 టెట్ పరీక్షలో చేసిన పొరపాట్ల కారణంగా 3,893 మంది అభ్యర్థులు నష్టపోయారు. ప్రశ్నపత్రం పేపర్ కోడ్‌ను వేయకపోవడంతో 3,677 మంది, ఒకటి కంటే ఎక్కువ కోడ్‌లు వేసిన 216 మంది ఫలితాలను నిలిపివేశారు. 21 నుంచి రూ.15 చెల్లించి అభ్యర్థులు ఓఎంఆర్ జవాబు పత్రం కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తమ పొరపాట్లు, మార్కులు, ఇతర అంశాలను తెలుసుకోవచ్చు.
 పేపర్-2 దారుణం: 2014 మార్చిలో నిర్వహించిన నాలుగో టెట్ పేపర్-2లో అర్హత సాధించిన వారికంటే ఈసారి పేపర్-2లో అర్హుల సంఖ్య మరిం తగా తగ్గింది. ఇప్పటివరకు జరిగిన టెట్‌లను పరిశీలిస్తే... పేపర్-2లో అర్హుల సంఖ్య క్రమంగా పడిపోతోంది. తొలి టెట్ పేపర్-2 లో 49.68 శాతం మంది అర్హత సాధించగా... రెండో టెట్‌లో 47.02 శాతం, మూడో టెట్‌లో 46.56 శాతం, నాలుగో టెట్‌లో 28.56 శాతం, తాజాగా జరిగిన ఐదో టెట్‌లో 25.04 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. మరోవైపు పేపర్-1లో అర్హుల శాతం క్రమంగా పెరుగుతోంది. తొలి టెట్ పేపర్-1లో 44.27 శాతం అర్హత పొందగా.. తాజా టెట్‌లో 54.45 శాతం మంది అర్హత సాధించారు.
 
 ఆనందంగా ఉంది..
 మాది మెదక్ జిల్లా పాపన్నపేట మండ లం ముద్దాపూర్. పేపర్-1లో 150 మార్కులకు 134 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న స్మితా సబర్వాల్ నాకు ఆదర్శం. ఐఏఎస్ సాధించాలనేది నా లక్ష్యం.
 -  ఊరడి స్నేహలత పేపర్-1లో టాపర్
 
 మా ఆయన  సహకారంతోనే..
 పేపర్-2లో 126 మార్కులు సాధించ డం ఆనందంగా ఉం ది. మాది కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి. ఇక్క డి సూర్యోదయ హైస్కూల్‌లో టీచర్ చేస్తున్నా. నా భర్త శ్రీనివాస్ ప్రభుత్వ టీచర్. ఆయన సహకారం ఫలితమే ఇది. డీఎస్సీ లో కూడా మంచి మార్కులు పొంది ప్రభుత్వ టీచర్‌గా స్థిరపడతా.
 - దాసరి శారదావాణి పేపర్-2లో టాపర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement