
రోహిత్‌కు ఏబీవీపీ నివాళులు
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు ఏబీవీపీ నివాళులర్పించింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, రోహిత్ చిత్రపటానికి బుధవారం ఏబీవీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హెచ్‌సీయూలో ఇటీవల జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, ఆ ఘటనలతో సంబంధం ఉన్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యతో హెచ్‌సీయూ వీసీ, హెచ్‌ఆర్డీకి ఎటువంటి సంబంధం లేదని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మట్ట రాఘవేందర్, రాష్ట్ర నాయకులు రాజేంద్రప్రసాద్, ఎల్లస్వామి పేర్కొన్నారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకునేలా వర్సిటీ అధ్యాపకులు ప్రేరేపించారని, ఏఎస్‌ఏ విద్యార్థులను డీన్ ప్రకాశ్‌బాబు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, పౌరహక్కుల ఉద్యమ నేత హరగోపాల్, విరసం నేత వరవరరావు, సూరేపల్లి సుజాత రెచ్చగొట్టారని ఆరోపించారు.