ఆదిలాబాద్‌కు ‘ఐసిస్ త్రయం’ | Adilabad to the 'Isis Trilogy' | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌కు ‘ఐసిస్ త్రయం’

Published Wed, Jan 6 2016 11:39 PM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

Adilabad to the 'Isis Trilogy'

సిటీబ్యూరో: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో చేరేందుకు వెళ్తూ చిక్కిన ముగ్గురు యువకులు అబ్దుల్లా బాసిత్, సయ్యద్ ఒమర్ ఫారూఖ్ హుస్సేనీ, మాజ్ హసన్ ఫారూఖ్‌లను సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు బుధవారం ఆదిలాబాద్ తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ ముగ్గురినీ వారం రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే.

నగరం నుంచి ద్విచక్ర వాహనాలపై బయలుదేరిన ఈ త్రయం వాటిని ఆదిలాబాద్‌లో పెట్టిన విషయం విదితమే. వీటిని సిట్ అధికారుల స్వాధీనం చేసుకోనున్నారు. మరోపక్క పట్టుబడటానికి ముందు నాగ్‌పూర్‌లో ట్రావెల్స్‌కు వెళ్లిన ఈ ముగ్గురూ శ్రీనగర్‌కు టికెట్లు బుక్ చేసుకున్నట్లు తేలింది. దీంతో వీరిని ఆదిలాబాద్ నుంచి నాగ్‌పూర్‌కూ తీసుకువెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement