వైద్యసేవలు, మౌలిక సదుపాయాలు తదితరాలను ఇచ్చిపుచ్చుకునేలా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్, నిమ్స్ ఆస్పత్రుల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
సాక్షి, హైదరాబాద్ : వైద్యసేవలు, మౌలిక సదుపాయాలు తదితరాలను ఇచ్చిపుచ్చుకునేలా కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) మెడికల్ కాలేజ్, నిమ్స్ ఆస్పత్రుల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి సమక్షంలో అధికారులు ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలోని అత్యాధునిక లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, ట్రైనింగ్, ఎమర్జెన్సీ విభాగాలను నిమ్స్ ఆస్పత్రి ఉపయోగించుకునేందుకు ఈఎస్‌ఐసీ అంగీకరించింది. అలాగే నిమ్స్ ఆస్పత్రిలోని నిపుణులైన వైద్య సిబ్బంది, స్పెషలిస్టులు ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీకి అవసరమైనప్పుడు ఉపయోగపడేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.