ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తేల్చి చెప్పిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో, పదో షెడ్యూల్‌లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, ఉద్యోగుల విభజన పూర్తయిన తర్వాత.. ఆ సంస్థల బోర్డులు తీర్మానం చేసి పంపితే పదవీ విరమణ వయసు పెంపుపై విధానపరమైన ప్రకటన చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం శనివారం ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 112) జారీ చేశారు. ప్రభుత్వ రంగసంస్థల ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడం, ఉన్నత న్యాయస్థానం దీనిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టీకరించాలని కోరడం తెలిసిన సంగతే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై నిర్ణ యం తీసుకుంది. కాగా ప్రభుత్వ నిర్ణయా న్ని ఉద్యోగుల జేఏసీ తప్పుపట్టింది.
విభజన తర్వాతే పదవీ విరమణ వయసు పెంపు
Published Sun, Jun 19 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM
Advertisement