చిరంజీవిని కలిసిన ఏపీ మంత్రులు
హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అయ్యన్న పాత్రుడు, కామినేని శ్రీనివాస్ శనివారం చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా రాజధాని శంకుస్థాపనకు చిరంజీవిని ఆహ్వానించారు.
ఈ నెల 22న అమరావతి శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. సమయం దగ్గర పడుతున్నందున ఈ ఆహ్వాన కార్యక్రమాలను సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు వేగవంతం చేశారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను అపాయింట్మెంట్ కోరిన చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం ఆయనతో భేటీ కానున్నారు.