హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనల్లో.. ఇప్పటి వరకు రూ. 95 వేలుగా ఉన్న ఎమ్మెల్యేల జీతాన్ని రూ. 1 లక్షా 50 వేలకు పెంచాలని, హెచ్ఆర్ఏను రూ. 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించారు.
ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫించన్ను సైతం 25 వేల నుంచి 50 వేలకు పెంచాలని ప్రతిపాదించారు. రైల్వే చార్జీల నిమిత్తం లక్ష రూపాయలు, బుక్స్ అలవెన్స్ కింద లక్ష రూపాయలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, వాహనాల అడ్వాన్స్కు గాను ఇంతకు ముందున్న 10 లక్షల రూపాయలను 20 లక్షలకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఈ భారీ పెంపుపై పలు విమర్శలు వ్యక్తమౌతున్నాయి.