ఇష్టంగా అష్టాంగ | Ashtanga Yoga is gaining popularity in the city | Sakshi
Sakshi News home page

ఇష్టంగా అష్టాంగ

Published Tue, Oct 28 2014 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

ఇష్టంగా అష్టాంగ

ఇష్టంగా అష్టాంగ

చిట్‌చాట్
 
సిటీలో అష్టాంగ యోగకు ఆదరణ పెరుగుతోంది. యువత నుంచి వస్తున్న డిమాండ్‌తో ఇప్పుడు యోగా గురువులు ఏకంగా అష్టాంగ యోగలోని మెలకువలను నేర్చుకుంటున్నారు. అష్ట్టాంగ యోగ సాధకుడు పట్టాభి జోయిస్ వద్ద శిష్యరికం చేసిన ముంబైకి చెందిన దీపికా మెహతా ‘ఐదు రోజుల అష్టాంగ వర్క్‌షాప్’ కోసం హైదరాబాద్‌కు వచ్చారు. తిరుమలగిరిలోని అనాహత యోగా జోన్‌లో యోగా టీచర్లకు శిక్షణ ఇస్తున్న దీపికా మెహతాతో

‘సిటీప్లస్’ చిట్‌చాట్.

విద్యార్థుల్లో ఏకాగ్రత, పాజిటివ్ థింకింగ్ పెరగటానికి అష్టాంగ యోగ ఉపయోగపడుతుంది. ఈ యోగాసనాల వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. శారీరకంగా బలం కలుగుతుంది. సూర్యనమస్కారాలతో మొదలయ్యే ఈ యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి ఉంటాయి. నడుము వంచడం, కాళ్లను, చేతులను విల్లులా ఎటుబడితే అటు తిప్పడం వంటి వ్యాయామాల ద్వారా భౌతికంగా శరీరాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా అందంగా, ఆరోగ్యంగా ఈ యోగా ద్వారా ఉండవచ్చు. ఆధ్యాత్మిక ధ్యానంవైపు మనస్సును కూడా మరలించవచ్చు.

యోగా అంటే ప్రాణం...

మనస్సుకు ప్రశాంతతనిచ్చే యోగా అంటే తనకు తగని ఇష్టమని అంటోంది దీపికా మెహతా. ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడే మెడిటేషన్ చేశా. పదేళ్ల నుంచి యోగా చేయడం మొదలెట్టా. నాకు జరిగిన ప్రమాదంతో నేను మళ్లీ తిరిగి ఫిట్‌గా అవుతానన్న ఆశ లేకుండా పోయింది. కేరళ, హృషికేశ్‌లో టీచర్స్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు యోగా పాఠాలు చెప్పడం మొదలెట్టా. లాస్‌ఏంజెలెస్‌లో టీచ్ చేస్తున్నప్పుడు పవర్ యోగా గురించి తెలుసుకున్నా. ఆ తర్వాత ఇండియా చేరుకుని పట్టాభి జోయిస్ వద్ద శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు ఇండియాలో పవర్ యోగా పాఠాలు చెప్పే ముగ్గురిలో ఒకరిగా పేరు తెచ్చుకున్నా.

మన సంస్కృతి అంటే మహా ఇష్టం.,...

అమెరికాలో ప్రతిరోజూ మూడు కోట్ల మంది యోగా చేస్తున్నారు. అదే మన ఇండియాలో అలా జరగడం లేదు. అందుకే మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రమోట్ చేసేందుకు యోగాను చక్కని వేదికగా వినియోగించుకుంటున్నా. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పదులకు పైగానే వర్క్‌షాప్‌లు నిర్వహించా. హైదరాబాద్‌లో అష్టాంగ యోగాలో శిక్షణ ఇస్తుండటం ఎంతో సంతోషాన్నిచ్చింది. స్థానిక యోగా టీచర్ల నుంచి మంచి స్పందన ఉంది.

వాంకె శ్రీనివాస్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement