13 నుంచి బడిబాట
13 నుంచి బడిబాట
Published Thu, Jun 1 2017 4:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
- బడిబాటలో కలెక్టర్లూ పాల్గొనాలి
- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జూన్ 13 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. విద్యా సంవత్సర ప్రారంభం, బడిబాట, ఇతర విద్యా కార్యక్రమాలపై బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. రోజుకో గ్రామంలో నిర్వహించే బడిబాట కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాలని సూచించారు. విద్యార్థుల నమోదు సంఖ్యను బట్టి ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలా వద్దా అనే అధికా రాన్ని కలెక్టర్లకే అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. కలెక్టర్ల ఫండ్‌తో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి కింద నిధులు సమకూర్చి పాఠశాలల్లో ఫర్ని చర్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కలెక్టర్లకు పలు సూచనలు...
ఉన్నత పాఠశాలల్లో విద్యుత్తు సరఫరా, ప్రహరీ గోడలు ఉండేలా చూడాలని కడియం శ్రీహరి సూచించారు. ‘బాలికల కోసం 84 కొత్త కేజీబీవీలు, వీధి బాలలు, అనాథలు, నమోదు కాని విద్యార్థుల కోసం 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యాయి. వాటిల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 11 వేల మంది విద్యా వలంటీర్లను నియమించుకునేందుకు ఆదేశాలి చ్చాం. వారంతా జూన్ 12 నాటికి స్కూళ్లలో ఉండేలా చూడాలి. హరితహారం కింద పాఠశాలల్లో మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి. రెసిడెన్షియల్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో డిజిటల్ క్లాసులు, సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, బయో మెట్రిక్ పరికరాలు, కంప్యూటర్ ల్యాబ్స్ ఉండేలా చూడాలి.
Advertisement
Advertisement