పోలీస్ కస్టడీకి భరత్
బంజారాహిల్స్: మద్యం సేవించిన మత్తులో మితిమీరిన వేగంతో కారు నడుపుతూ యువతి మరణానికి కారకుడై జైలు శిక్ష అనుభవిస్తున్న సామ భరత్‌సింహారెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. గురువారం భరత్‌సింహారెడ్డిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ నెల 1వ తేదీన తెల్లవారుజామున జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ సమీపంలోని హుడా కాలనీలో కారు ప్రమాదంలో దేవి అనే యువతి మరణానికి కారకుడైన భరత్‌సింహారెడ్డిని 304 పార్ట్-2 సెక్షన్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే మరింత సమాచారం రాబట్టే నిమిత్తం భరత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీ కోరుతూ ఐదు రోజులు కస్టడీకి అనుమతించింది. విచారణ అనంతరం సోమవారం ఉదయం ఆయనను తిరిగి జైలులో అప్పగించాల్సి ఉంటుంది. ఆ రోజు జరిగిన ఘటన వివరాలు, ఎవరెవరున్నారు, ఎప్పుడు బయల్దేరింది, డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారా? ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునే నిమిత్తం పోలీసులు కస్టడీ కోరారు.