భార్య శీలంపై నింద వేశాడని వ్యక్తి హత్య | The murder of the wife of the person who placed the blame alone | Sakshi
Sakshi News home page

భార్య శీలంపై నింద వేశాడని వ్యక్తి హత్య

Published Thu, Jul 10 2014 2:56 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

The murder of the wife of the person who placed the blame alone

  • తలపై బండరాయితో మోది హతం
  • కూడేరు : తన భార్య ప్రవర్తన సరిగా లేదనడంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి, మద్యం మత్తులో తన తోటి గ్రామస్తున్ని బండరాయితో మోది హతమార్చాడు. కూడేరు మండల పరిధిలోని ముద్దలాపురంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కమ్మ హనుమంతప్ప(55), ఎర్రిస్వామి కలిసి మంగళవారం రాత్రి అనంతపురంలో మద్యం సేవించారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు.

    కూడేరుకు రాగానే మంచి నీరు తాగి తిరిగి బయలుదేరారు. మార్గం మధ్యలో తమ స్వగ్రామం సమీపంలోకి వెళ్లగానే రోడ్డు పక్కన బీడు భూముల్లోకి వెళ్లారు. అక్కడికి వెళ్లాక హనుమంతప్ప తన సెల్‌ఫోన్‌లో ఓ మహిళతో సంభాషించాడు. ఫోన్ పెట్టేశాక..సదరు మహిళ గూరించి తప్పుగా మాట్లాడారు. అదే సమయంలో ఎర్రిస్వామిని ఉద్దేశించి..‘నీ భార్య ప్రవర్తన కూడా మంచిది కాదంటూ’ చెప్పబోయాడు.

    అతని మాటలకు కోపోద్రిక్తుడైన ఎర్రిస్వామి పక్కనే ఉన్న ఓ బండరాయితో హనుమంతప్ప తలపై రెండు, మూడుమార్లు బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భయపడ్డ ఎర్రిస్వామి బుధవారం పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. వెంటనే ఎస్‌ఐ సుబ్బరాయుడు, సిబ్బందితో వెళ్లి హతుడి మృతదేహాన్ని, బండరాయిని పరిశీలించారు.

    పోలీసుల సమాచారంతో మృతుడి భార్య తిప్పమ్మ, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని గోడున విలపించారు. తిప్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, హనుమంతప్ప  మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement