రీడిజైనింగ్ పేరిట నిధులు దుబారా: భట్టి
రాష్ట్రంపై రూ.96 వేల కోట్ల అదనపు భారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాధన ఉద్యమంలో కీలకాంశాలైన నీళ్లు, నిధులను సీఎం కేసీఆర్ నాశనం చేస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీరు, సంక్షేమం రంగాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి బలమైన పునాది వేశారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈపీసీ విధానానికి కేసీఆర్ తూట్లు పొడిచారన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై, ఖజానాపై రూ.96 వేల కోట్ల అదనపు భారం పడుతున్నదన్నారు. కేసీఆర్ కమీషన్ల కోసం ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైనింగ్ చేశారని ఆరోపించారు.