‘సింగరేణి’ అవినీతిపై విచారణ చేపట్టాలి : భట్టి
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో భారీ అవినీతి జరిగిందని, దానిపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం పాల్పడిన స్కాములపై విచారణ జరిపిస్తే అధికారపార్టీలోని ముఖ్య నేతల బండారం కూడా బయటపడుతుందన్నారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కదానిని పూర్తిగా అమలుచేయలేదన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని పట్టించుకోవడంలేదని విమర్శించారు. సింగరేణి వ్యవస్థను నీరుగార్చారని ఆరోపించారు. సింగరేణిలో ఆధారపడిన కుటుంబసభ్యులకు(డిపెండెంట్)లకు ఉద్యోగాలను ఇస్తామని హామీనిచ్చినా టీఆర్‌ఎస్ అమలుచేయడంలేదని భట్టి విమర్శించారు.