వందకోట్ల బిల్లుల దంచుడు..! | billion bills .. | Sakshi
Sakshi News home page

వందకోట్ల బిల్లుల దంచుడు..!

Published Sat, Sep 6 2014 2:03 AM | Last Updated on Tue, Aug 21 2018 12:12 PM

వందకోట్ల బిల్లుల దంచుడు..! - Sakshi

వందకోట్ల బిల్లుల దంచుడు..!

ఆదాయుం పెంచుకునేందుకు జలవుండలి భారీ కసరత్తు
ఇకపై ‘గ్రేటర్’లో పక్కాగా నీటిబిల్లుల వసూళ్లు
మొండిబకాయిదారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కొరడా
 మీటర్లు లేని నల్లాలకు వినియోగదారులే వాటిని ఏర్పాటు చేసుకోవాలి

 
సిటీబ్యూరో: జలమండలి గ్రేటర్ పరిధిలో నెలకు రూ.వందకోట్ల బిల్లుల దంచుడుకు శ్రీకారం చుట్టింది. ఈ నెలనుంచి ప్రతినెలా మీటర్ రీడర్లు జారీ చేస్తున్న బిల్లులను నిర్ణీత గడువులోగా ఠంచనుగా చెల్లించాలని వినియోగదారులపై ఒత్తిడి తేనుంది. ప్రస్తుతం జల వుండలి ద్వారా ప్రతినెలా సుమారు వందకోట్ల మేర బిల్లులు జారీ అవుతున్నాయి. కానీ ఇం దులో వసూళ్లు రూ. 75 కోట్లు మించడం లేదు. దీంతో ఇక నుంచి బిల్లుల వసూలు లక్ష్యం వంద కోట్ల వరకు సాధించాలని లక్ష్యం నిర్దేశించుకుంది. మరోవైపు వెయ్యికోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో.. మొండిబకాయిదారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకా రం నోటీసులు జారీ చేయాలని సంకల్పిం చింది. అప్పటికీ బకాయిలు చెల్లించనివారి చరాస్తుల జప్తుకు సైతం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం జనరల్ మేనేజర్లకు రెవెన్యూ అధికారాలను కట్టబెట్టింది. ప్రత్యేక సెల్‌నూ ఏర్పాటు చేసింది. ఈ విభాగం ద్వారా ఇటీవల పలు ప్రైవేటు ఆస్తులను జప్తు చేసి, మొండిబకాయిదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.

బిల్లుల మేళా... గ్రేటర్ పరిధిలో జలమండలికున్న 16 నిర్వహణ డివిజన్ల పరిధిలో 8.25 లక్షల కుళాయి కనెక్షన్లున్నాయి. ఇందులో మురికివాడలవి 1.25 లక్షలు, మరో 50 వేలు బల్క్, వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లున్నాయి. మిగతా 6.5 లక్షల కనెక్షన్లు గృహవినియోగ నల్లాలున్నాయి. ఇవికాక ప్రతినెలా సుమారు 1,500 నూతన కుళాయి కనెక్షన్ల జారీ, 674 ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా, గేటెడ్ కమ్యూనిటీలు, గ్రామీణ నీటిసరఫరా సంబంధించి సుమారు రూ.100 కోట్లు నీటి బిల్లులు జారీ అవుతున్నాయి. కానీ వసూళ్లు 75 కోట్లకు మించడం లేదు. దీంతో రెవెన్యూ ఆదాయాన్ని పెంచేం దుకు ఈ కసరత్తు చేస్తున్నామని జలవుండలి వర్గాలు పేర్కొన్నాయి.
 మొండిబకాయిలపైనే సందిగ్ధం.

ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. జలమండలికి కొన్నేళ్లుగా రూ.వెయ్యి కోట్ల మేర మొండిబకాయిలు పేరుకుపోయాయి. ఇందులో సగం వరకు సర్కారు విభాగాల బకాయిలే. నీటి బిల్లులు భారీగా బకాయి పడిన గ్రామీణ నీటిసరఫరా విభాగం, కంటోన్మెంట్‌బోర్డు, సర్కారు విభాగాలు, ప్రభుత్వ ఆస్పత్రులు, క్వార్టర్లు, రైల్వేశాఖ కార్యాలయాలకు ఇటీవలే జప్తు నోటీసులు జారీ చేసింది. అరుునా ఆశించిన ఫలితం లేకపోవడంతో ఆయా విభాగాలపై ప్రభుత్వ పరంగా ఒత్తిడిని పెంచడం ద్వారా బకాయిలు రాబట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.

మీటరింగ్ పాలసీపై దృష్టి

ఇక మహానగరం పరిధిలో ప్రస్తుతం 1,318 వాణిజ్య నల్లాలకు జీఎస్‌ఎం టెక్నాలజీ ఆధారంగా పనిచేసే మీటర్లను బోర్డు ఏర్పాటు చేసింది. ఇక మరో 4 లక్షల గృహవినియోగ కుళాయిలకు మీటర్లున్నాయి. మిగతా కనెక్షన్లకు సంబంధించి నీటి మీటర్లు లేని వినియోగదారులే స్వయంగా నల్లాలకు మీటర్లను ఏర్పాటు చేసుకోవాలని జలమండలి స్పష్టం చేస్తోంది. లేకుంటే రెండింతల నీటిబిల్లులు జారీ చేస్తావుని హెచ్చరిస్తోంది.
 
బిల్లుల లక్ష్యం (రూపాయల్లో)

 
‘గ్రేటర్’ నల్లా కనెక్షన్లు:    8.25 లక్షలు
నెలవారీగా జారీ అవుతున్న బిల్లులు:    100 కోట్లు
ప్రస్తుతం వసూలవుతున్నవి:    75 కోట్లు
మొండి బకాయిలు:    వెయ్యి కోట్లు
వీటిలో సర్కారు విభాగాలవి:    500 కోట్లు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement