బిస్కెట్ హౌస్
‘కాదేదీ కవితకనర్హం’ అన్నారు శ్రీశ్రీ. కాదేదీ కట్టడానికనర్హం అంటున్నాడు చెఫ్ అడ్డెట్ల మహేష్. బిస్కెట్లతో ఆయన రూపొందించిన గృహ నమూనా అందరికీ నోరూరిస్తోంది. మహేష్ గచ్చిబౌలిలోని డాక్టర్ వైఎస్సార్ నిథమ్ స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ విభాగంలో చెఫ్. దీని కోసం మొదట బటర్, మైదా, కోకో పౌడర్, జింజర్ పౌడర్, లిక్విడ్ గ్లూకోజ్‌తో జింజిర్ బిస్కెట్లను తయారు చేశాడు. ఐసింగ్ షుగర్, లెమన్ జూస్, కోడిగుడ్డు తెల్ల సొనతో బిస్కెట్లను అతికించేందుకు క్రీమ్‌ను సిద్ధం చేశాడు. ఈ క్రీమ్‌ను ఉపయోగించి ఒక్కో బిస్కెట్‌ను అతికించి ఇలా ఓ అందమైన ఇంటిని రూపొందించాడు.
ఒక హాలు.. దాని ముందు ఇరువైపులా పోర్టికోలను ఏర్పాటు చేశాడు. దీంతోపాటు వంటగదిపై పొగ గొట్టాన్ని కూడా అమర్చాడు. దీనికి ‘జింజిర్ బ్రెడ్ హౌస్’గా నామకరణం చేశాడు. ఇది చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తయారీకి రెండు
రోజులు పట్టిందని మహేష్ చెప్పాడు.
- రాయదుర్గం