మిక్స్ సంసిద్ధంగా
క్రిస్మస్, న్యూ ఇయర్ అనగానే నోరూరించే కేక్‌లు కళ్ల ముందు కదలాడతాయి. రంగు రంగుల్లో... రకరకాల డిజైన్లలో క్రేజీగా మన వంక ఓ లుక్కేస్తుంటాయి. ఎప్పుడూ బయట నుంచి కొనుక్కోవడమేనా... ఇంట్లో చేసుకొంటే... ఆ ఆనందం... ఆ టేస్టే వేరు కదూ! అలాంటి
అభిరుచి ఉన్నవారందరికీ గచ్చిబౌలి డాక్టర్ వైఎస్సార్ నిథిమ్‌లో శనివారం కేక్‌లు, స్వీట్లు తయారీలో శిక్షణ ఇచ్చారు. మహిళలు ఎంతో మంది ఇందులో ఆసక్తిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చెఫ్ ఎ.మహేష్ ఎలా చేయాలో ‘సిటీ ప్లస్’కు వివరించారు.
క్రిస్మస్ కేక్ తయారీకి చాలా ప్రాసెస్సే ఉంది. దాదాపు నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే అన్నీ సక్రమంగా కుదురుతాయి. అన్ సాల్టెడ్ బటర్ లేదంటే కేక్ మార్జరిన్ (లూజ్‌గా దొరకడం కష్టం), పౌడర్ సుగర్, గుడ్లు, వెనీలా, మొలాసిస్ లేదంటే క్యారమల్ కలర్, మైదాపిండి, బేకింగ్ పౌడర్... డ్రైఫ్రూట్స్‌లో కాజు, బాదం, కిస్మిస్, డ్రై చెర్రీస్, టూటీ ఫ్రూటీ, బ్లాక్ కారెన్స్, ఆరెంజ్ పీల్, పిస్తా... స్పైసెస్‌లలో దాల్చినచెక్క, లవంగాలు, సోంపు, జింజర్, ఇలాచి పౌడర్... లిక్కర్‌లో రమ్, బ్రాందీ, బీర్, విస్కీ, రెడ్ వైన్, వైట్ వైన్
కావలసిన పదార్థాలు. ఎలా చేయాలంటే...
దాదాపు నెల రోజుల ముందుగా అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌ను లిక్కర్‌లో నానబెట్టాలి. ప్రతి రోజు వాటిని తప్పనిసరిగా మిక్స్ చేస్తుండాలి. మొదట బటర్, సుగర్ పౌడర్‌ను క్రీమ్‌గా చేయాలి. అనంతరం ఎగ్స్, వెనీలా కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. ఆ తర్వాత క్యారమెల్ కలర్, డ్రైఫ్రూట్స్, బేకింగ్ పౌడర్‌లను మిక్స్ చేసి, నానబెట్టాలి. అనంతరం బేకింగ్ టిన్ పేపర్ వేసి 3/4 భాగం నింపాలి. అలా తయారు చేసిన బేకింగ్ టిన్‌లను 180 డిగ్రీలలో 35 నుంచి 40 నిమిషాలపాటు బేక్ చేయాలి. అనంతరం సుగర్ డస్ట్ వేసి సర్వ్
చేసుకోవాలి.
డిజైనింగ్...
ఆ తరువాత ముఖ్యమైనది కేక్ డెకరేషన్. ఇందుకు ఆల్మండ్ పేస్ట్, మార్జరిన్, సుగర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాంతో డిజైనింగ్ చేయాలి. ఒకవేళ కేక్‌లో కోడి గుడ్డు వద్దనుకుంటే దానికి బదులుగా కండెన్స్‌డ్ మిల్క్ వాడుకోవచ్చు.