
‘నారాయణపై చర్యలు తీసుకోండి’
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఐ నేత నారాయణపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కాచిగూడ పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు.
ప్రధానమంత్రిని నరికివేయాలి, కాల్చి చంపేయాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేయటం దేశంలో హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్, నేతలు రవికుమార్, నరేందర్‌పవార్ ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాచిగూడ ఏసీపీకి వినతిపత్రం అందజేశారు.