పశువుల జాతర
మణికొండ: విభిన్న జాతులకు చెందిన పశువులు సందడి చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక గేదెలు ఆకర్షణగా నిలిచాయి. నార్సింగ్‌లో శుక్రవారం నిర్వహించిన పశుసంక్రాంతిలో బర్రెలు, ఆవులు 300 వరకు రాగా.. వాటిలో 152 వరకు అమ్ముడుపోయాయి. హర్యానాకు చెందిన ముర్రా జాతి రూ. లక్ష ధర పలికింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్లారెడ్డి అనేవ్యక్తి రూ. లక్షకు ముర్రాజాతి బర్రెను కొనుగోలు చే శారని మార్కెట్ కమిటీ కార్యదర్శి వరలక్ష్మి తెలిపారు. సాయంత్రం వరకు అధికారికంగా రూ. 60 లక్షల వ్యాపారం జరిగిందని ఆమె పేర్కొన్నారు. జెర్సీ ఆవులు రూ. 40 వేల నుంచి రూ. 60 వేల వరకు అమ్ముడుపోయాయి.
రోజుకు 20 లీటర్లు..
గుజరాత్‌కు చెందిన దులియా జాతి బర్రె రూ. 2.10 లక్షలకు ఒకటి చొప్పున రెండు రూ. 4.20 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి. వీటిని మహేశ్వరంకు చెందిన పాలవ్యాపారి రవియాదవ్ కొనుగోలు చేశారు. అధికారికంగా మాత్రం తక్కువ ధరకు కొన్నట్టు మార్కెట్‌యార్డు రిసిప్టు తీసుకున్నట్టు తెలిసింది. ఉదయం, సాయంత్రం కలసి రోజుకు 20 లీటర్ల పాలు ఇవ్వటం వీటి ప్రత్యేకత.