ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి: చాడ | Chada comments on SC issue categorization | Sakshi
Sakshi News home page

ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి: చాడ

Published Sat, Apr 30 2016 3:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Chada comments on SC issue categorization

సాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణ కోసం కేంద్రంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని సీఎం కేసీఆర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎంకు ఆయన ఈ మేరకు శుక్రవారం లేఖ రాశారు. సీఎం నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని కోరారు. ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ రెండు దశాబ్దాలుగా న్యాయ సమ్మతమైన పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.

ఈ పోరాటాన్ని బీజేపీ సమర్థించిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా జాప్యం చేస్తోందని తెలిపారు. గతంలో ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తే సుప్రీంకోర్టు అడ్డుకుందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం చట్టసవరణ ద్వారా ఎస్సీ వ ర్గీకరణను ఎలాంటి అడ్డంకులు లేకుండా అమలు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement