‘జనహిత’ ద్వారా అందరినీ కలుసుకోవాలి | Chada Venkata Reddy comments on CM kcr | Sakshi
Sakshi News home page

‘జనహిత’ ద్వారా అందరినీ కలుసుకోవాలి

Published Sat, Feb 18 2017 2:12 AM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM

‘జనహిత’ ద్వారా అందరినీ కలుసుకోవాలి - Sakshi

‘జనహిత’ ద్వారా అందరినీ కలుసుకోవాలి

కేసీఆర్‌కు చాడ సూచన

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఇప్పటి కైనా తన వైఖరి మార్చుకొని జనహిత కార్యక్రమం ద్వారా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలను కలుసుకోడానికి అవకాశం కల్పిస్తారని సీపీఐ ఆకాంక్షించింది. రెండున్నరేళ్లలో ప్రజలను కలుసు కోడానికి కేసీఆర్‌ నిరాకరించారని.. అయితే తన 63వ జన్మదినం సందర్భంగా ‘జనహిత’కు సీఎం నాంది పలకడాన్ని సీపీఐ స్వాగతిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కేసీఆర్‌కు సీపీఐ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలస్యంగానైనా ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకు లు, కార్యకర్తలకే ఇప్పటివరకు కేసీఆర్‌ దర్శనం పరిమితమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement