కార్పొరేషన్ల యాక్షన్ ప్లాన్లు జారీ చేయాలి | Corporations Action Plans To be issued | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్ల యాక్షన్ ప్లాన్లు జారీ చేయాలి

Published Sat, Dec 3 2016 3:12 AM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM

కార్పొరేషన్ల యాక్షన్ ప్లాన్లు జారీ చేయాలి - Sakshi

కార్పొరేషన్ల యాక్షన్ ప్లాన్లు జారీ చేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ

 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2016-17) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల కార్యాచరణ ప్రణాళిక నోటిఫికేషన్ జారీకి ఆదేశాలు జారీ చేయాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది. ఈ కార్పొరేషన్ల ద్వారా ఆ యా వర్గాల లబ్ధిదారులకు గతేడాది మంజూరు చేసిన సబ్సిడీ విడుదలకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు.

తెలంగాణ ఉద్యమంలో యువత పాత్ర, త్యాగాలు మరవలేనివని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా యువత ఆకాంక్షల మేరకు ఉద్యోగ అవకాశాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా వర్గాలకు చెందిన యువత తీవ్ర నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని, వారిని ఆదుకునేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement